Sep 16,2023 15:04

ప్రజాశక్తి-పెరవలి : నిడదవోలు నియోజకవర్గంలో దళిత ఉద్యోగస్తుల వేధింపులను నిరసిస్తూ, నియోజకవర్గపు కన్వీనర్ వెన్నపు సుధాకర్ ఆధ్వర్యంలో  పెరవలి సెంటర్ బి .ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఒక రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టమన్నారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ నియోజవర్గంలో పలు గ్రామాల్లో దళితులకు స్మశాన మరు భూమి లేకపోవడం, ఉన్న చోట్ల ఆక్రమణలకు గురి కావడం, ఇంటి స్థలాలు ఇవ్వడానికి దళితుల దగ్గర డబ్బులు వసూలు చేయడం, అర్హులైన అనేక మంది దళితులకు నేటికీ వరకు ఇళ్ల స్థలాలు ఇవ్వక పోవడం, దళిత కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడాన్ని నిరసిస్తూ, బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఒక రోజు రిలే నిహారాదీక్ష చేస్తున్నామన్నారు.  ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బద్దజాన్  జిల్లా నాయకులు ఏలూరి అశోక్ కుమార్ చల్లాబత్తుల సత్యనారాయణ చిర్ర రాజు నల్లి రమేష్ తాడేపల్లి సుందర్రావు పత్తి రమేష్ జీడిగుంట వెంకటేశ్వర్లు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.