ప్రజాశక్తి-చాగల్లు : బాటిలింగ్ యూనిట్ లో హమాలీలు నిరసన మద్యం కంపెనీల అసోసియేషన్ బాధ్యులైన కామేశ్వరరావు హమాలీల సంఘ గౌరవాధ్యక్షులు కే ఉమామహేశ్వరరావు పట్ల దురుసుగా ప్రవర్తంచడం నిరశిస్తూ రాష్ట్ర హమాలీల సంఘం పిలుపు మేరకు గురువారం చాగల్లు ఎపి బిసి ఎల్ ఐ ఎమ్ ఎఫ్ ఎల్ డిఫో సిబ్బది డిఫో వద్ద నిరశన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కామేశ్వరరావు యొక్క దురుసుదనానికి క్షమాపణ చెప్పాలని కోరుతూ డిపోలో ఎగుమతి దిగుమతి పనులను నిలిపు వేసారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు హమాలీ కార్మికులు పాల్గొన్నారు.










