ప్రజాశక్తి-మండపేట ప్రత్యేక అవసరాల చిన్నారుల భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో భాగంగా ప్రభుత్వం మండలానికి ఒకటి చొప్పున ఉమ్మడి జిల్లాలో 64 భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. అవి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 22 మండలాల్లో 22 కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో అంధత్వం, చెవిటి, మూగ, మానసిక వైకల్యం, నాడీ సంబంధిత వైకల్యం తదితర విద్యార్థులు లైప్‌సిల్క్స్, స్పీచ్‌థెరపీ, చైన్ లాంగ్వేవేజ్, లిప్ రీడింగ్, ఐడెంటిఫికేషన్, రైటింగ్ స్కిల్స్ తదితర విద్యను అందిస్తుంటారు. వీరికి సంవత్సరానికి ఒకసారి ట్రై సైకిల్, హియరింగ్ ఎడ్, రోలెటర్, క్లచ్చర్స్, వా కింగ్ స్టిక్, కళ్ల జోళ్లు, ఎంఆర్ కిట్లు తది తర ఉపకరణాలతో పాటు అందరి విద్యార్థులకు ట్రాన్స్‌పోర్టు అలవెన్స్ రూ.300 విజువల్ ఇంపైర్డ్, అంగవైకల్యం ఎస్కార్ట్ రూ.300, గర్ల్స్ స్టాపిన్స్ 6 తరగతి నుంచి 10వ తరగతి వరకు రూ.200, రీడింగ్ రూ.200, హోం బేసిడ్ రూ.200 అలవెన్స్‌లను ప్రభుత్వం నెలకోసారి అందిస్తుంది. ఇవే కాక ఫిజియోథెరపీ డాక్టర్ వారానికి ఒకసారి వీరికి ప్రత్యేక సేవలందిస్తూ ఉంటారు.
ఈ కేంద్రాల్లో పని చేసే సహిత విద్యా ఉపాధ్యాయులు కొందరు 2019లో స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ చేపట్టకపోవడంతో జిల్లాలో 44 మంది ఉండగా 30 మాత్రమే ఉండగా 14 ఖాళీలు ఉన్నాయి. అంతేకాక 7 మండలాల్లో మాత్రమే ఫిజియోథెరపీ సేవలు నిరంతరాయంగా అందు తున్నాయి. స్పీచ్‌థెరఫీ, సైకాలజిస్టు ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంది.
బీటలు తీసిన గోడలతో ఆందోళన
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న భవిత కేంద్రంలో విద్యార్థులు ఎక్కి వెళ్ళేందుకు ఏర్పాటు చేసిన రెయిలింగ్ ట్రాక్‌కు ఒక పక్క రెయిలింగ్ చోరికి గురయ్యింది. విద్యుత్ స్విచ్‌బోర్డులు, తలుపులు మర మ్మతులకు గురి కావడంతో పాటు బీటలు తీసి ప్రమా దాలకు నిలయంగా ఉన్న గోడలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఎప్పుడు ఏప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అంతేకాక అంగవైకల్యం ఉన్న విద్యార్థులు వాక్‌కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రోలేటర్ మూలకు చేరింది.
పాఠశాల ఆస్తులకు రక్షణ కరువు
ఈ కేంద్రం చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో ఇక్కడి ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. ఇటీవల కాలంలో వాటర్ మోటర్ చోరీకి గురి కావడంతో విద్యార్థుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని విద్యార్థిని తండ్రి ఒకరు సొంత నగదుతో కొత్త మోటర్ కొన్నారు. అంతేకాక వరుసగా రెండు రోజుల పాటు కేంద్రానికి సెలవు వస్తే మందు మద్యం బాటిళ్లతో ఆవరణం అంతా అస్తవ్యస్తంగా మారుతోందని, ప్రతి రోజూ ఏదో ఒక గృహోపకరణాన్ని పాడు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిలిచిన మెయింట్‌నెన్స్ గ్రాంట్
కేంద్రం అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.10,000 గ్రాంటును అందిస్తుండగా కరోనా సమయం నుంచి అది నిలిచిపోయింది. ఈ విషయంపై జిల్లా సహిత విద్యా సమన్యయకర్త ఎంవివిఎస్ నారాయణను ఉపాధ్యాయుల ఖాళీలను, మెంయిటినెన్స్‌లను ప్రభుత్వానికి నివేదించామన్నారు.










