Sep 12,2023 23:45

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
కంపోస్టింగ్‌, వర్మి కంపోస్టు సేంద్రీయ పద్ధతిలో ఉత్పత్తి చేస్తున్న రీ సైక్లింగ్‌ కేంద్రాల్లో సిబ్బంది భద్రతా ప్రమాణాలను తప్స నిసరిగా పాటించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత సూచించారు. స్థానిక లూథర్‌ గిరి సమీపంలోని మునిసిపాలిటీ రీసైక్లింగ్‌, క్వారీ మార్కెట్‌ సమీపంలోని వర్మి కంపోస్ట్‌ కేంద్రాలను సందర్శిం చారు. ఈ సందర్భంగా విండ్రో కంపోస్టింగ్‌, వర్మి కంపోస్ట్‌, సేంద్రీయ పద్ధతిలో ఎరువుల తయారీ, గహ వ్యర్ధాలు మరియు హానికర వ్యర్ధాల ప్రాసెసింగ్‌ ప్రక్రియలలో అనుసరిస్తున్న పద్ధతులను, పరికరాల పనితీరును ఆమె పరిశీలించారు. రీసైక్లింగ్‌, వ్యర్ధాలను సేకరించడం, వివిధ రకాల వ్యర్ధాలను వేరు చేయడం వంటి ప్రక్రియలలో సిబ్బంది ఎదుర్కొంటున్న సవాళ్ళను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు వ్యర్ధాలను వేరు వేరుగా ఇవ్వడం వల్ల వారి పని సులభం అవ్వడంతోపాటు మరింత మెరుగ్గా వ్యర్ధాలను రీసైక్లింగ్‌ చేసే అవకాశం ఉంటుందని రాజమహేం ద్రవరం నగర పాలక సంస్థ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా రీసైక్లింగ్‌ కేంద్రాలలో పని చేస్తున్న కార్మికులతో ఆమె మాట్లాడుతూ అందరూ ఖచ్చితంగా భద్రతా ప్రమాణాలను అనుసరించాలని కోరారు. ఎలాంటి న్యాయ సహాయం అవసరమైన జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించ వచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కె. ప్రత్యూష కుమారి, ఎంహెచ్‌ఒ ఎ..వినూత్న, ఆర్‌ఎంసి ఈఈ షేక్‌ మదార్‌ అలీ, తదితరులు పాల్గొన్నారు.