ప్రజాశక్తి-గోకవరం(తూగో) : మండల కేంద్రమైన గోకవరం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల యందు బేటి బచావో బేటి పడావో అనే కార్యక్రమం ఎంపీహెచ్ఈఓ వైఎస్ రాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో స్త్రీలు ఇంకా కొన్ని ప్రాంతాలలో వెనకంజలో ఉంటున్నారని స్త్రీలు అందరూ కూడా చదువుకోవాలని చదువుకుని అత్యున్నత స్థానాలు అధిరోహించి ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించి సమాజానికి దిక్చూసి కావాలన్నారు. బ్రున హత్యలు నివారించాలని గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టారీక్ష నేరమని తెలిపారు. కార్యక్రమంలో సిహెచ్ఓ మేరి కృప, శైలజ, సుజాత, శ్రీనివాస్, పవన్, రమణ, నాగలక్ష్మి, సూర్యకాంతం, విద్యార్థులు పాల్గొన్నారు.










