Mar 01,2023 15:56
  • హాజరైన మేడపాటి షర్మిళారెడ్డి, జక్కంపూడి గణేష్‌
  • హెయిర్‌, స్కిన్‌ ట్రీట్‌మెంట్లు అందచేస్తాం..
  • వెల్లడిరచిన సిఇఓ హరితారెడ్డి

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం : భారతదేశంలోనే అతి పెద్ద లగ్జరీ బ్యూటీ సెలూన్‌ సేవలు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. దేశంలోనే బ్యూటీ సెలూన్‌ రంగంలో పేరెన్నిక గన్న ‘హివాగా’ రాజమహేంద్రవరం దానవాయిపేటలో తన 4వ షోరూమ్‌ను బుధవారం ఘనంగా ప్రారంభించినున్నట్టు సంస్థ సిఇఓ హరితారెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఆథారిటీ చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిళారెడ్డి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ యువనాయకుడు జక్కంపూడి గణేష్‌, రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కె.త్రినాధరెడ్డి, వైఎస్‌ఆర్‌సిపి మాజీ ఫ్లోర్‌ లీడర్‌ పోలు విజయలక్ష్మి, పలువురు నగర ప్రముఖులు విచ్చేసారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో సిఇఓ హరితారెడ్డి మాట్లాడుతూ బ్యూటీ సేవలతో పాటు ప్రత్యేకంగా హెయిర్‌, స్కిన్‌ ట్రీట్‌మెంట్‌, జీవిత కాల గ్యారంటీతో అవాంఛిత రోమాలను తొలగించేందుకు కూడా తమ వద్ద ప్రత్యేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రెండు అంతస్తులతో అత్యంత ఆధునిక సౌకర్యాలతో ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు అన్ని సేవలు అందించేందుకు తమ వైద్యులు, సిబ్బంది సిద్ధంగా ఉంటారన్నారు. డెర్మటాలజీ, కాస్మోటిక్‌ విభాగంలో ఎటువంటి కన్సల్టేషన్‌ ఫీజు లేకుండా వైద్యం పొందే అవకాశాన్ని హివాగా అందుబాటులోకి తెస్తుందన్నారు. ఇప్పటివరకు విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌లో హివాగా బ్యూటీ సెలూన్‌తో పాటు హెయిర్‌, స్కిన్‌ ట్రీట్‌మెంట్‌ అందిస్తూ ముందుకు సాగుతున్నాయన్నారు. ఇప్పుడు రాజమహేంద్రవరం ప్రజలకు కూడా ఈ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్టు వివరించారు. రూ 500 నుంచి తమ బ్యూటీ సెలూన్‌ సేవలు ఉన్నాయన్నారు. అన్ని వయసుల వారికి తమ బ్యూటీని మెరుగుపరుచుకునేందుకు అవసరమైన సేవలు పొందేందుకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. దీనితో పాటు బ్క్రెడల్‌ మేకప్‌, పార్టీ మేకప్‌లు కూడా ఎవరికి నచ్చిన విధంగా వారికి నచ్చే విధంగా అందంగా తయారు చేసి పంపడానికి హివాగా ముందుంటుందని పేర్కొన్నారు. అందరికీ అందుబాటు ధరల్లో పేరెన్నికన్న హివాగా బ్యూటీ సేవలు అందిస్తామని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిఇఓ హరితారెడ్డి కోరారు. ముందుకు అప్పాయింట్‌ మెంట్‌ తీసుకుని ఎవరికి నచ్చిన సేవలను వారు పొందేందుకు కూడా హివాగా అవకాశం ఇస్తోందని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ చైర్మన్‌ సత్తి రామ్మోహన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.