Apr 05,2023 10:59

ప్రజాశక్తి-కడియం : ఈనెల 10వ తేదీ న కాకినాడలో జరిగే బీసీ ఐక్య కార్యాచరణ రౌండ్‌ టేబుల్‌ సమావేశం విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , జోన్ 2 కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మండలంలోని వేమగిరి ఆయన నివాసం వద్ద జరిగిన సమావేశానికి పలువురు బీసీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న వెనుకబడిన కులాలకు రాజ్యాంగపరంగా రావలసిన వాటా, హక్కుల   కోసం బీసీలంతా కలిసి కట్టుగా పోరాటం చేయాలన్నారు.  వెనుకబడిన కులాలు ఒకే మాటపై ఉంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి తమ హక్కులు సాధించుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఐదు జిల్లాల పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు, కార్యదర్శులు వి.వీరబాబు, బొంతు గంగాధర్ రావు, పైలా సాంబశివరావు, కొల్లుబోయిన శ్రీనివాసరావు, పితాని శివరామకృష్ణ, బత్తుల త్రిమూర్తులు, కర్ణిడి గౌరినాయుడు, గుడిగంట వెంకటేశ్వరరావు, రెడ్డి శ్రీనివాస చక్రవర్తి , స్థానిక బిసి నాయకులు పాల్గొన్నారు.