ప్రజాశక్తి-రాజమహేంద్రవరం : దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా తీవ్రమైన అన్యాయం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్, ఇన్‌చార్జ్ బోను దుర్గా నరేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీలను బిచ్చగాళ్లుగా చూస్తు కేంద్ర ఆర్థిక బడ్జెట్‌లో 2 వేల కోట్లు కేటాయించడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. స్థానిక విఎల్ పురంలో ఉన్న గాండ్ల/తెలికుల సంక్షేమ సంఘం కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో సంపద సృష్టిస్తున్న బీసీల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఈనెల 8, 9 తేదీల్లో చలో ఢల్లీ కార్యక్రమాన్ని తలపెట్టినట్టు వివరించారు. కేంద్ర బడ్జెట్ బడా వ్యాపారులు, అగ్రవర్ణాలను పెంచి పోషించేలా ఉందే తప్ప దాని వల్ల బీసీలకు ఎటువంటి న్యాయం జరగదన్నారు. బడ్జెట్ ద్వారా దేశంలో ఉన్న బీసీల వెన్నెముక విరిగిపోయేలా చేసిన కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేసారు. బీసీ సంఘంలో ఉన్న కొందరు కోవర్టులు ఇచ్చిన సమాచారం మేరకు రాష్ట్ర కో ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న నరవ గోపాలకృష్ణను సస్పెండ్ చేస్తున్నట్టుగా కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో తానే ప్రకటించడం జరిగిందని, ఆ తరువాత తప్పు తెలుసుకుని ఆర్.కృష్ణయ్య తదితర నేతలతో కలిసి చర్చించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని తెలిపారు.నరవ గోపాలకృష్ణ మాట్లాడుతూ బీసీ సంఘం నుంచి తనను సస్పెండ్ చేస్తు తీసుకున్న నిర్ణయం చాలా బాధ కలిగించిందని, అయితే జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తక్షణం స్పందించి బీసీ సంఘం నాయకుల్ని తన వద్దకు పంపి సమస్యను పరిష్కరించడాన










