ప్రజాశక్తి-చాగల్లు : చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జెడ్ పీ హైస్కూలు లో బేటి బచావో - బేటి పడావో అనే ఈ కార్యక్రమము నందు “ ఆడపిల్లను రక్షించు - ఆడపిల్లను చదివించు “ కార్యక్రమంలో నిర్వహించారు. ఆడపిల్లలే రేపటి ఆశ. ఆడపిల్లలు తల్లిదండ్రుల జీవితంలో ఆశాకిరణాలు. ఒక కుమార్తె రేపటి తల్లి, కాబట్టి ఆమెను ఎప్పుడూ చంపవద్దు. ఒక అమ్మాయి దేవుని శక్తివంతమైన సృష్టి; అనే స్లోగన్ తో పిసిపిఎన్ డిటి చట్టం గురించి అవగాహనా కల్పించటం జరిగినది. ఈ కార్యక్రమం లో సిహెచ్ శ్రీనివాస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్, పీహెచ్ఎన్. వి.పద్మ , ఎస్, సారమ్మ ఎం రాజశేఖర రెడ్డి, వెంకట రామకృష్ణ, పి రేవతి, డి నరసమ్మ మరియు ఆశలు తదితరులు పాల్గొన్నారు.










