ప్రజాశక్తి-గోకవరం : మండలంలోని కొత్తపెళ్లి గ్రామంలో బ్యాంక్ ఆఫ్ బరోడా 116 ఆవిర్భావ దినోత్సవం వేడుకలు బ్యాంక్ మేనేజర్ కే భాస్కరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా వ్యవస్థాపకులు సయాజిరావు చిత్రపటానికి పూలమాలు చేసిన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమం ఉద్దేశించి భాస్కరరావు మాట్లాడుతు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రారంభించి 116 సంవత్సరాలు పూర్తి చేస్తుందని తెలిపారు. బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా అమలు పరుస్తున్న సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని తెలిపారు. అనంతరం భారీ కేక్ కట్ చేసిన సిబ్బంది సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది వి వాసు కుమార్ రెడ్డి, నేరయ్య బంగారి, డి రవికుమార్, డ్వాక్రా మహిళలు బ్యాంకు ఖాతాదారులు పాల్గొన్నారు.










