ప్రజాశక్తి-తాళ్లపూడి
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న బంగారు కొండ కార్యక్రమాన్ని ఆయా కేంద్రాల నిర్వహకులు విజయవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణ పిలుపునిచ్చారు. మండల ప్రత్యేక అధికారిగా నియమితులైన డిపిఒ సోమవారం మండలంలోని పలు అంగనవాడి కేంద్రాలలో బంగారు కొండ కార్యక్రమాన్ని పరిశీలన చేయడానికి వచ్చారు.
బంగారు కొండ కిట్ల పంపిణీ..
బంగారు కొండ పథకం ద్వారా చిన్నారులను ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్దాలని ఎంపిపి జొన్నకూటి పోసిరాజు కోరారు. బంగారు కొండ పథకానికి తాళ్లపూడి మండలం లో గుర్తించిన 95 మంది చిన్నారులకు సంబంధించిన కిట్లను ఎంపిడిఒ కార్యాలయంలో సోమవారం ఆయా కేంద్రాల టీచర్లకు అందజేశారు. ఐసిడిఎస్ కొవ్వూరు సిడిపిఒ మమ్మీ మాట్లాడుతూ రక్తహీనత కలిగి ఉన్న చిన్నారులలో బలం పెంచేందుకు దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గోపాలపురం సంపూర్ణ పోషణకు బంగారు కొండ పథకం ఉపయోగపడుతుందని మండల ప్రత్యేక అధికారి సత్య గోవింద్ అన్నారు. సోమవారం బంగారు కొండ కార్యక్రమం ఎంపిడిఒ ఆర్. శ్రీదేవి అధ్యక్షతన నిర్వహించారు. బంగారు కొండ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రవీంద్రనాథ్, హౌసింగ్ ఎఇ శ్రీనివాసరావు, ఎఒ రాజారావు తదితరులు పాల్గొన్నారు.










