Feb 10,2023 23:42

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.ప్రత్యూషకుమారి స్థానిక వై.జంక్షన్‌ సమీపంలో ఉన్న ప్రభుత్వ బిసి సంక్షేమ బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. వసతిగృహ పరిసరాలు, వంటగదులు, టాయిలెట్లను పరిశీలించారు. వసతులు, పరిసరాల పరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు మరింత సుచికరమైన, రుచికరమైన భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. తాగునీటి విషయంలో జాగ్రత్తలు పాటించాలని, టాయిలెట్లను ప్రతిరోజూ శుభ్రం చేయించాలని ఆదేశించారు.
వసతిగృహంలో విద్యార్థులతో మాట్లాడుతున్న జడ్జి ప్రత్యూషకుమారి