Mar 06,2023 22:33

ప్రజాశక్తి - సీతానగరం ఇనగంటివారిపేటలో ఆత్మహత్య చేసుకుంటానని ఒక యువకుడు సోమవారం వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి వీరంగం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని యువకుడితో సంబాషించారు. ప్రభుత్వ భవనాలకు ఎలక్ట్రికల్‌ పనులు చేసిన బిల్లులు ఇవ్వడం లేదని తనకు ఆత్మహత్యే శరణ్యమని బాధిత యువకుడు దార్ల బ్రహ్మం తెలిపాడు. పోలీసులు సమస్య పరిష్కరిస్తామని నచ్చజెప్పి ట్యాంకు పైనుంచి కిందకు దింపి పోలీస్‌ స్టేషన్‌కు తరలించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.