ప్రజాశక్తి-నిడదవోలు బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా బిఎస్‌పి పని చేస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బి.పరంజ్యోతి అన్నారు. జనవరి 26 నుంచి ఫిబ్రవరి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న చైతన్య యాత్ర శుక్రవారం నిడదవోలు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక ఎబిఎస్ టౌన్ హాల్లో పి.విజరు కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఆయన మాట్లాడారు. దేశంలో మోడీ పరిపాలన బహుజనులకు ఎంతో ప్రమాదకరంగా మారిందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రభుత్వం మార్చేయడానికి ప్రయత్నిస్తోందని, దీన్ని బహుజనులంతా ప్రతిఘటించాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో ఆర్డినేటర్స్ ఎల్.రాజారావు, మల్లికల్ గడ్డం సంపదరావు, గుమ్మాపు చిత్ర సేన్, తిరుపతిరావు, కొల్లాబత్తుల సత్యం, పి.కనకమహాలక్ష్మి, వెన్నాపు సుధాకర్, బయ్యే మునీంద్ర, తాడేపల్లి రాజన్నబాబు, అంబటి పుల్లారావు పాల్గొన్నారు.










