ప్రజాశక్తి-రాజమహేంద్రవరం పిల్లల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు బాలోత్సవాలు ఎంతగానో దోహదం చేస్తున్నాయని ఎంఎల్‌సి షేక్ సాబ్జి అన్నారు. నగరంలోని హోటల్ జగదీశ్వరిలో గోదావరి బాలోత్సవం బ్రోచర్‌ను సోమవారం పిఎస్‌ఎన్ రాజు అధ్యక్షతన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే దేవరపల్లి, హేలాపురి ప్రాంతాల్లో నిర్వహించిన బాలోత్సవం కార్యక్రమాలకు అద్భుతమైన స్పందన వచ్చిందని అన్నారు. ఆ కార్యక్రమాల స్ఫూర్తితో ఈ నెల 25, 26 తేదీల్లో రాజమహేంద్రవరం వేదికగా జరిగే గోదావరి బాలోత్సవానికి తన సహకారాన్ని అందిస్తానని తెలిపారు.
అహ్వాన కమిటీ ఏర్పాటు
గోదావరి బాలోత్సవం ఆహ్వన కమిటీ ఏర్పాటు అయింది. కమిటీ గౌరవాధ్యక్షునిగా షేక్ సాబ్జీ, గౌరవ సలహాదారుగా వి.భాస్కర రామ్, అధ్యక్షులుగా తిరుమల విద్యా సంస్థల అధినేత నున్న తిరుమలరావు, గౌరవ సలహాదారుగా ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు, అసోసియేట్ అధ్యక్షునిగా రిటైర్డ్ ఒఎన్‌జిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి.ఎం.ఆర్.శేఖర్, ప్రధాన కార్యదర్శిగా పిఎస్‌ఎన్‌రాజును నియమించారు.










