Jun 17,2023 14:34

ప్రజాశక్తి -గోకవరం : మండల కేంద్రమైన గోకవరం ఎంపీడీవో కార్యాలయం నందు ఎంపీడీవో కె పద్మజ్యోతి ఆధ్వర్యంలో మూడు రోజులపాటు సచివాలయం ఉద్యోగులకు గ్రామ వాలంటీర్లకు జగనన్న సురక్ష పై శనివారం శిక్షణ తరగతులు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు టౌన్ కన్వీనర్ చింతల అనిల్ కుమార్ ఎంపీటీసీ తోలేటి రాంప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందించి సీఎం జగన్ కి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు శిక్షణ తరగతుల్లో ఎంపీడీవో పద్మజ్యోతి మాట్లాడుతూ ఈ శిక్షణా తరగతులు మూడు రోజులు పాటు ప్రజలకు అందించే సేవలుపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు గ్రామ వాలంటీర్లు ప్రజా ప్రతినిధులు గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు అధికారులు జగనన్న సురక్ష కార్యక్రమం గురించి ఇంటికి వెళ్లి వివరించాలన్నారు సచివాలయంలో సుమారు 5వందలు పైన సేవలు ఉన్నాయని సేవలను ఏ విధంగా ప్రజలకు ఇవ్వాలి అనే అంశాలపై ఈ నెల 24తేదీ నుండి గ్రామ వాలంటీర్లు సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి వారి యొక్క అవసరతలు సమస్యలను గుర్తించి సమస్య పరిష్కారం కోసం సంబంధిత అధికారులుతో చర్యలు చేపట్టాలన్నారు ధ్రువీకరణ పత్రాలు పథకాలకు సంబంధించిన సమస్యలపై ప్రజల నుండి అర్జీలు స్వీకరించి పరిష్కరించాలన్నారు సమస్యలుపై మండల స్థాయి అధికారులతో సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో పిఓపిఆర్డి ఎం రాజేశ్వరరావు పంచాయితీ కార్యదర్శులు గ్రామ వాలంటీర్లు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు