ప్రజాశక్తి - ఉండ్రాజవరం : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సౌజన్యం, యుబిఐ సహకారంతో మండలంలోని చిలకపాడులో ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఎవర్నెస్ క్యాంప్ ను బుర్రకథ ప్రదర్శన ద్వారా ప్రదర్శించినట్లు సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ కౌన్సిలర్లు జోగయ్య, సురేష్ సి ఏ లు తెలిపారు. శుక్రవారం పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ అవగాహన కార్యక్రమంలో బుర్రకథ కళాకారులచే బుర్రకథ రూపంలో బ్యాంకులకు సంబంధించిన అన్ని రకాల ఖాతాలు, పొదుపులు, పొదుపు వల్ల ఉపయోగాలు గురించి అవగాహన కల్పించారన్నారు. ఆర్ డి, ఎఫ్ డి, కరెంట్ అకౌంట్ ల గురించి తెలియజేసినట్లు వారు తెలిపారు. బ్యాంకులో ఉన్న వివిధ రకాలైన ఇన్సూరెన్స్, పి ఎం జె జె వై, పి ఎం ఎస్ బి వై, పీఎం ఏపీ వై, ఎస్ ఎస్ వై పి, పి ఎఫ్ అకౌంట్ లు, డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థ, ఆన్లైన్ మోసాల గురించి అనేక విషయాలు చర్చించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ తిరుమల వెంకట సూర్య కుమారి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.










