ప్రజాశక్తి-చాగల్లు : చాగల్లు మండల పశు వైద్యశాల వారి ఆధ్వర్యంలో చాగల్లు-3 రైతు భరోసా కేంద్రం (ఆర్ బి కె ) వద్ద పెరటి కోళ్ల పెంపకం మరియు పాడి రైతులకు అవగాహన సదస్సును పశువైద్యాధికారి డా.యు.ముఖేష్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు కోళ్ళలో
వచ్చే వ్యాధులు నివారణ మరియు జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకం,పెయ్య దూడల పథకం, సమీకృత మిశ్రమ దాణా, కిసాన్ క్రెడిట్ కార్డులు,మరియు వివిధ ప్రభుత్వ పథకాలను గురించి రైతులకు అవగాహన కల్పించి వారికి లివర్ టానిక్,ఖనిజ లవణ మిశ్రమ మందులు ఉచితంగా పంపిణీ ఈ కార్యక్రమంలో మండల రైతు సంగం సభ్యులు గారపాటి.వెంకట సుబ్బారావు,.కంకటాల.బుద్దుడు, కొటారు.నాగేశ్వరరావు, జుట్ట.కృష్ణమూర్తి, నిమ్మగడ్డ సురేష్ , సిబ్బంది కరిష్మా,విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










