Jan 30,2023 15:11

ప్రజాశక్తి-చాగల్లు : మండలంలో బ్రాహ్మణగూడెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఆజాది క అమృత మహోత్సవం లో భాగంగా మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా " స్పర్శ " అనే కార్యాక్రమము జనవరి 30 తేదీ నుండి ఫిబ్రవరి 13 తేదీ వరకు కుష్టి వ్యాధి నివారణ (స్పర్శ ) అవగాహనా కార్యక్రమం, కుష్టు వ్యాధి "మైక్రో బ్యాక్టీరియం లేప్రే" అను బాక్టీరియా వలన వస్తుంది. లక్షణాలు : శరీరంపై స్పర్శ లేని రాగిరంగు మచ్చలు, చేతులు, పాదాలు నరములలో తిమ్మిర్లు అనిపించటం, చెవి తమ్మెలు మందంగా మారిపోవటం ఈ పై లక్షణాలు ఏవైనా ఉంటె అనుమానించేలా ఉంటె ఆరోగ్య సిబ్బంది మరియు ప్రాధమిక ఆరోగ్యకేంద్రం వారిని కలవమని చెప్పటం జరిగినది ఉచిత పరీక్షలు, ఉచిత మందులు ఇవ్వబడును. ఈ కార్యాక్రమములో వైద్యాధికారి డా పి ఆర్ ఎల్ దేవి గ్రామ సర్పంచ్  గురివెళ్లి కుమారి ఎంపీటీసీ ప్రత్తిపాటి వెంకటేశ్వరరావు మరియు ఆరోగ్య విస్తరణాధికారి సిహెచ్ . శ్రీనివాస్ , పి హెచ్  ఏస్ సారమ్మ, డి నరసమ్మ, ఎం.రాజశేఖర, రేవతి ఆరోగ్య సిబ్బంది ఆశలు ప్పాల్గొన్నారు.