Oct 02,2023 15:17

ప్రజాశక్తి-కడియం : కడియం గ్రామానికి చెందిన కవి, పర్యావరణమిత్ర, సేవాశీలి చిలుకూరి శ్రీనివాసరావు గాంధీజీ సద్భావన అవార్డును అందుకున్నారు. గాంధీ జయంతి సందర్భంగా విజయవాడలో  సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు పి విజయబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా అకాడమీ అధ్యక్షులు కొమ్మినేని శ్రీనివాస్ చేతుల మీదుగా శ్రీనివాస్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ చైర్మన్ పి గౌతంరెడ్డి, మీడియా అకాడమీ కార్యదర్శి బాలగంగాధర తిలక్, పిల్లా అంతరపిక్ సొసైటీ అధ్యక్షులు అద్దంకి రాజయోన, కళావేదిక అధ్యక్షులు కత్తిమండ ప్రతాప్, డ్రీమ్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు మేదర సురేష్ తదితరులు పాల్గొని శ్రీనివాస్ సేవలను ప్రశంసించారు.