May 01,2023 23:43

ప్రజాశక్తి-గోపాలపురం టిడిపి గోపాలపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి మద్దిపాటి వెంకట్రాజు సౌజన్యంతో సోమవారం 265 మంది ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా పాలసీ బాండ్లను అందజేశారు. చెక్‌పోస్ట్‌ సెంటర్‌లో ఆటో డ్రైవర్ల యూనియన్‌, డ్రైవర్లతో కలిసి ఆయన మేడే వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం మద్దిపాటి వెంకట్రాజు మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో డ్రైవర్లకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే కుటుంబానికి బాసటగా ఉండేందుకు చంద్రన్న బీమా ఎంతో ఉపయోగపడేదని అన్నారు. వైఎస్‌.జగన్‌ అధికారంలోకి వచ్చాక అనేక పథకాలతో పాటు ప్రమాద బీమా పథకం కూడా నిర్వీర్యం చేశారన్నారు. అధికారం లేకపోయినప్పటికీ డ్రైవర్లకు తన వంతుగా రెండేళ్లకు సంబంధించి ప్రీమియం తన సొంత ఖర్చులతో చెల్లించినట్లు తెలిపారు. అనంతరం ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్లి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.