May 01,2023 23:41

ప్రజాశక్తి-యంత్రాంగం రాజమహేంద్రవరం సిపిఎం, సిఐటియు శ్రేణులు నగరంలో వాడవాడలా పతాకాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, సిపిఎం రాజమహేంద్రవరం నగర కార్యదర్శి బి.పవన్‌ మాట్లాడారు. వెట్టి చాకిరి, బానిసత్వానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం చేసిన పోరాటం నుంచి పుట్టిందే ఎర్రజెండా అన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వం స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో సాధించుకున్న కార్మిక హక్కులను కాల రాస్తోందన్నారు. కేంద్ర రాష్ట్ర పాలకుల విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు, ఇతర ప్రజలతో కలిసి ఐక్య ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. సిపిఎం నాయకులు పి.తులసి, ఎస్‌ఎస్‌.మూర్తి, ఎన్‌.రాజా, పోలిన వెంకటేశ్వరరావు, ఐ.సుబ్రహ్మణ్యం, బి.పూర్ణిమ రాజు, కె.రామకష్ణ, జి.తాతారావు, ఎం.వెంకటలక్ష్మి, వి.రాంబాబు, టి.శ్రీను, లక్ష్మి, దివ్య, రాజు, టి.స్వేచ్ఛ పాల్గొన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకష్ణ ఎఐటియుసి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ, సభల్లో పాల్గొన్నారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు, కె.రాంబాబు, బివి.కొండలరావు, సప్పా రమణ, పెంటి దేముడు, వెంకటరావు, కాళ్ల అప్పలనాయుడు, నల్లా రామారావు, కె.జ్యోతి రాజు ప్రసంగించారు. ఇన్నీసుపేటలో దర్జీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మేడేలో భట్లంకి ప్రకాష్‌, సిఐటియు జిల్లా కార్యదర్శి బి.పూర్ణిమరాజు, ఎం.శ్రీను, ప్రసాద్‌, కోటేశ్వరరావు, ట్రెజరర్‌ మహేష్‌, దుర్గా ప్రసాద్‌, బండి శ్రీను, నరసింహారావు, సత్యవతి, అరుణ, మంగాదేవి, రమణమ్మ, ఉదరు రాజు, కుమార్‌, రాము, ప్రసాద్‌ పాల్గొన్నారు. న్యూడెమోక్రసీ, ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో నిర్వమించిన కార్యక్రమంలో ఎస్‌.కిరణ్‌ కుమార్‌, కె.సూరిబాబు, విజయ, భాను, ధర్మేష్‌, మావో రెడ్డి, రమణ పాల్గొన్నారు. వైసిపి కేంద్ర కమిటీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి సంహిత కన్వెన్షన్‌ సెంటర్లో జరిగిన కార్మిక సదస్సులో పాల్గొన్నారు. తొలుత కంబాలచెరువు సెంటర్‌లో జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహానికి వైసిపి జిల్లా అద్యక్షుడు, రాజానగరం ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా, రుడా ఛైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిలా రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నరవ గోపాలకష్ణ, లంక సత్యనారాయణ, బొంత శ్రీహరి, కరుణామయుడు బోసు, కోటయ్య, మేడి త్రిమూర్తులు, వివిధ సంఘాల కార్మికులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ప్రజాశక్తి ఎడిషన్‌ కార్యాలయంలో సీఁయర్‌ నాయకులు టిఎస్‌.ప్రకాశ్‌ అరుణపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎడిషన్‌ మేనేజర్‌ డి.శ్రీనివాస్‌, సమన్వయకమిటీ కన్వీనర్‌ ఎన్‌.పావనమూర్తి, ఐద్వా సీఁయర్‌ నాయకులు టి.సావిత్ర, ప్రజాశక్తి సిబ్బంది పాల్గొన్నారు. సీతానగరంలో సిపిఐ (ఎంఎల్‌) నాయకులు పలివెల వీరబాబు, పలివెల జ్యోతి, సిద్దే నాగరాజు, నందమూరి చిట్టి స్వామి పాల్గొన్నారు. గోకవరం ఎలక్ట్రికల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు పాలేపు నాగేశ్వరరావు, కంబాల మురళి, జి.శివప్రసాద్‌ పాల్గొన్నారు. నల్లజర్లలో సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు శేషారావు, బొంగు వీరభద్రం, రాగోలు శ్రీనివాస్‌, పెసరగంటి త్రిమూర్తులు, సింగవరపు భాస్కరరావు, శ్రీరామ శ్రీనివాస్‌, ముద్దన రామలింగేశ్వరరావు, అచ్యుత నాగరాజు, మానూరి పండు, పెనుమాక కృష్ణారావు, పూతి రాంబాబు, భీమాడ శ్రీను, యలమంచిలి సింహాద్రి, పెనుమాక వెంకట్రావు పాల్గొన్నారు. ధవళేశ్వరం సర్వరాయ సుగర్స్‌ లిమిటెడ్‌, కోకోకోలా కంపెనీ, సదరన్‌ డ్రగ్స్‌, యర్రకొండ శివాజీ మెడికల్స్‌, హార్లిక్స్‌ ఫ్యాక్టరీ వద్ద మేడే ఘనంగా నిర్వహించారు. పడాల రామకష్ణ, కర్రి రామకష్ణ, ఎస్‌.దుర్గాప్రసాద్‌, కె.రంగారావు, సిహెచ్‌.లక్ష్మణరావు, డి.శేషారావు, క్రిస్టోఫర్‌, ప్రేమ్‌ పాల్గొన్నారు. డి.అప్పారావు, వి.పేరయ్య లింగం జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రామభద్రం, ఎన్‌.అప్పారావు, ఆర్‌.శ్రీనివాస్‌, యు.శ్రీనివాస్‌, పి.శ్రీనివాసరాజు, వై.సుందర్రావు, డి.దుర్గారావు, వి.రామకష్ణ, వేమగిరి రామకష్ణ, కర్రి రామకష్ణ, కష్ణ పాల్గొన్నారు. రాజానగరంలో న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడేలో సత్తిబాబు, పి.వెంకట్‌ నాయుడు, పి.వెంకట నాయుడు పాల్గొన్నారు. గోపాలపురంలో సిరికొండ వీర్రాజు, మహేష్‌, కడియం శ్రీనివాస్‌, వెంకన్న, సత్యనారాయణ, సత్యనారాయణ, కష్ణారావు, సతీష్‌, సోమేశ్వరరావు, శ్రీను, సుబ్బారావు, నాని, దుర్గారావు, ప్రసాద్‌ పాల్గొన్నారు. తాళ్లపూడి భారీగా వర్షం కురుస్తున్నా కార్మికులంతా రోడ్లపైకి చేరి ఎర్రజెండా పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. వి.నరసింహమూర్తి, యు.కేదారేశ్వరరావు, ఈశ్వర్‌, ఏసు, మైదాకుల ఆంజనేయులు పాల్గొన్నారు. కడియంలో సిఐటియు నాయకులు పి.విద్యాసాగర్‌, బివివి.శోభన్‌, టి.సాగర్‌, జె.శివరామకష్ణ, గుడాల చంద్రరావు, మర్రి శంకర్‌, కొత్తపల్లి సత్తిబాబు, కిట్టయ్య, దాసరి సూరిబాబు, సలాది రమేష్‌, భీమరాజు పాల్గొన్నారు. కొవ్వూరు రూరల్‌లో సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎం.సుందర్‌ బాబు, మైగాపుల నాగేశ్వరరావు, సిద్దిరెడ్డి బాపిరాజు, చిలకా మురళి, సాజిపల్లి పెంటయ్య, కొమ్మన రాముడు, మద్దుకూరి దొరయ్య, అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.మాణిక్యంబ, వి.శ్రీదేవి, నరసమాంబ, బి.భద్రం, మాణిక్‌ రెడ్డి, హరిబాబు, తిరుమల గణపతి, శివరామకృష్ణ జొన్నల రాంబాబు, మంచిలి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. పెరవలి ముక్కామలలో పూరెల్ల ధనరాజు, పంపన వెంకటేశ్వరరావు, చొక్కాకుల కిరణ్‌ రాజు, కంతేటి సుబ్బారావు, వేండ్ర వరప్రసాద్‌, రెడ్డి రామకష్ణ పాల్గొన్నారు. దేవరపల్లి పద్మశ్రీనివాస గ్యాస్‌ ఏజెన్సీ వద్ద యూనియన్‌ నాయకులు జెండా ఆవిష్కరణ చేశారు. వి.దుర్గారావు, షేక్‌ అబీబుల్లా, పాల్గొన్నారు.