Feb 03,2023 22:53

ప్రజాశక్తి- నిడదవోలు ఆర్‌టిసి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎస్‌డబ్ల్యుఎఫ్‌ నిడదవోలు డిపో కమిటీ గౌరవాధ్యక్షుడు జువ్వల రాంబాబు డిమాండ్‌ చేశారు. ఎస్‌డబ్ల్యుఎఫ్‌ ఆధ్వర్యంలో డిపో వద్ద శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ఉద్యోగ భద్ర కల్పించేలా విడుదల చేసిన సర్క్లుర్‌ నెం 1, 2019ను విధిగా అమలు చేయాలని కోరారు. అక్రమ ప్రమోషన్ల సాకుతో 2096 మందికి నిలిపివేసిన పిఆర్‌సి ఫిక్సేషన్‌ అమలు చేయాలన్నారు. లీవ్‌ ఎన్‌క్యాష్‌ మెంట్‌ ఆర్‌పిఎస్‌ 2019 బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్షులు పి.ఆనందకుమార్‌, కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు, ప్రచార కార్యదర్శి పి.సుధాకర్‌ పాల్గొన్నారు.