Oct 03,2023 23:43

తాళ్లపూడిలో జెఎఎస్‌ శిబిరంలో మందులను పరిశీలిస్తున్న మంత్రి వనిత

ప్రజాశక్తి - యంత్రాంగం
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు జిల్లాలోని పలు మండ లాల్లో మంగళవారం జరిగాయి. ఆయా కార్యక్రమాల్లో మంత్రి తానేటి వనిత, పలువురు ఎంఎల్‌ఎలు పాల్గొ న్నారు. తాళ్లపూడి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ పాలన సాగుతుందని మంత్రి తానేటి వనిత అన్నారు. మండలం లోని పెద్దే వం పంచాయతీ పరిధిలోని రావూరు పాడు గ్రామంలో జెఎఎస్‌ కార్యక్ర మాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వనిత మాట్లాడుతూ ప్రజలందరికీ ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించడానికే జెఎఎస్‌ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మలకపల్లి పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్‌ మైకేల్‌, ఎంపిడిఒ రమణ, ప్రత్యేక అధికారి సత్యనారాయణ, సర్పంచ్‌ టి. వెంకట్రావు, ఎంపిపి జొన్నకూటి పోసిరాజు, తదితరులు పాల్గొన్నారు. గోపాలపురం భీమోలు గ్రామంలో జెఎఎస్‌ కార్యక్రమం సర్పంచ్‌ అన్నపు వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక నిపుణులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఎఎల్‌ కంటి పరీక్షలను చేయించుకుని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఉండవల్లి సత్యనారాయణ, జడ్‌పిటిసి కె. లలిత, తహశీల్దార్‌ రవీంద్రనాథ్‌, వైసిపి నాయకులు బండారు దొరబాబు, రాంపండు, ఎండపల్లి శేఖర్‌ బాబు, తదితరులు పాల్గొన్నారు. సీతానగరం మండలంలోని వెదులపల్లి జడ్‌పి హైస్కూల్లో పిహెచ్‌సి వైద్యులు డాక్టర్‌ రాజు ఆధ్వర్యంలో జెఎఎస్‌ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప వైద్యాధికారి శ్రీధర్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గుర్రాల జ్యోస్నా, ఎంపిడిఒ కె.రమేష్‌, పిహెచ్‌సి వైద్యులు డాక్టర్‌ చైతన్య, డాక్టర్‌ యేసురాణి, డాక్టర్‌ మేఘన, పంచాయతీ కార్యదర్శి పద్మజా, పాల్గొన్నారు. గోకవరం మండలంలోని మల్లవరం గ్రామంలో జెఎఎస్‌ కార్యక్రమం జరిగింది. ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట మార్కెట్‌ కమిటి ఛైర్మన్‌ జనప రెడ్డి సుబ్బారావు, పార్టీ నాయకులు దాసరి రమేష్‌, పాటి రాం బాబు, సుంకర వీర బాబు, వరసాల ప్రసా ద్‌, కర్రి సూరా రెడ్డి, పాల్గొన్నారు.