Jun 22,2023 21:29

సమావేశంలో పాల్గొన్న జెసి తేజ్‌భరత్‌, కలెక్టర్‌ మాధవీలత, ఎంఎల్‌ఎ వెంకట్రావు

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో అర్హత కలిగిన లబ్ధి దారులను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని కలెక్టర్‌ కె.మాధవీలత అధికారులను ఆదేశించారు. అర్హుల జాబితాకు అనుగు ణంగా భూసేకరణ పూర్తిచేసి త్వరిత గతిన స్థలాలు కేటాయింపులు జరపాలని ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు పేర్కొ న్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గోపాలపురం నియోజక వర్గం హౌసింగ్‌ , జగనన్న కాలనీలు, ఇళ్ల స్థలాలపై పంచాయతీ రాజ్‌, ఆర్‌ డబ్ల్యూ ఎస్‌, రెవెన్యూ అధికారులతో కలెక్టర్‌, ఎంఎల్‌ఎతో కలిసి సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాధవీలత మాట్లాడుతూ ఎన్‌పిఐ, 90 రోజుల కార్యక్రమం, గడప గడపకు మన ప్రభుత్వం కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల కేటాయింపును వేగవంతం చేయాలన్నారు. గోపాలపురం మండలంలో 1,149కు 1,043 ఇళ్లను, దేవరపల్లిలో 2,944కి 2,461, నల్ల జర్లలో 2,016కి 1,046 ఇళ్లు గ్రౌండింగ్‌ అయ్యాయని తెలిపారు. ఇంకా నియోజక వర్గం పరిధిలో 1,559 ఇళ్లను కేటాయిం చాల్సి ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వ భూమి, లేదా భూసేకరణ ద్వారా 55,41 ఎకరాలను గుర్తించాల్సి ఉందన్నారు. నిర్మాణాలు స్టేజ్‌ కన్వర్షన్‌, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తహశీ ల్దార్లు, ఎంపిడిఒ, ఇతర శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాల న్నారు. నియోజకవర్గంలో ఎన్‌పిఐ కింద 7,096, తొంబై రోజుల్లో ఇళ్ల స్థలాల కింద 1,155, జిజిఎంపి కింద 1,696 వెరసి 9,947 దరఖాస్తులు వచ్చాయ న్నారు. స్థలాలు కేటాయించిన ప్రతి ఒక్క ఇల్లు తప్పనిసరిగా ప్రారం భించేలా చూడాలన్నారు. జగనన్న కాలనీలో ఉన్న లే అవుట్ల వద్ద తాగునీరు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. అనుసంధాన రహదారుల నిర్మాణం పనులు, భూముల పెండింగ్‌ లెవెలింగ్‌ పనులు త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలన్నారు. క్షేత్ర స్థాయి అధికారులు ఇందుకు సంబందించిన నివేదికలతో బుధవారం రావాలన్నారు. భూసేకరణ కోసం గుర్తించిన భూము లను జెసి, ఇతర అధికారులు పరిశీలి స్తారన్నారు. గ్రామాల వారీగా అర్హుల జాబితాను కచ్చితంగా మండల అధికా రులు నిర్ధారించాలన్నారు. ఎంఎల్‌ఎ తలారి మాట్లాడుతూ, గోపాలపురం నియోజక వర్గంలో 4బి సర్వే కోడ్స్‌ కింద 263 స్థలాలు, మ్యాపింగ్‌ కింద 93, జియో ట్యాగింగ్‌ కింద 75 పూర్తి చేయాల్సి ఉందన్నారు. కాలనీలో తాగు నీటి సమస్య లేకుండా చూడాలన్నారు. నల్లజర్ల 1,2, ఆవాపాడు, చోడవరం, దూబచేర్ల-1, ముసల్లంక, ప్రకాశరావు పాలెం, సుభద్రపాలెం, తదితర గ్రామాల్లో ఇళ్ల స్థలాల పెండింగ్‌ అర్జీలను పరిష్కరించాలన్నారు. ఈ సమా వేశంలో జెసి ఎన్‌.తేజ్‌భరత్‌, డిఆర్‌ఒ జి.నరసిం హులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.