ప్రజాశక్తి - ఉండ్రాజవరం(తూగో) : పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్నందున ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏపీఎం, ఎం.రత్న కుమార్ ను మండలంలోని చివటం, సత్యవాడ ఉన్నత పాఠశాలలకు ప్రత్యేక అధికారిగా నియమించినట్లు మండల విద్యాశాఖ అధికారి పీవీఎస్ నాగరాజు తెలిపారు. బుధవారం ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన ఉండ్రాజవరం మండల సమన్వయ సమావేశం లో ఏపీఎం ను ప్రధానోపాధ్యాయులకు పరిచయం చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ, ఏ శ్రీనివాస్, తహసిల్దార్ జి కనకరాజు, ప్రధాన ఉపాధ్యాయులు, వెల్ఫేర్ అసిస్టెంట్స్, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, మహిళా పోలీస్, ఏఎన్ఎం లు పాల్గొన్నారు.










