ప్రజాశక్తి-యంత్రాంగం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపొతే ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని పలువురు నాయకులు హెచ్చరించారు. బుధవారం పలుచోట్ల సభలు నిర్వహించారు. చాగల్లు అంగన్‌వాడీల పోరు యాత్రలో యూనియన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్.మాణిక్యాంబ మాట్లాడుతూ ఐసిడిఎస్ బలోపేతానికి బడ్జెట్లో నిధులు పెంచాలని, ఎన్నికలకు ముందు సిఎం జగన్ ఇచ్చిన హామీలు అమలుచేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కార్యదర్శి సి.హెచ్.విజయ కుమారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె.బేబిరాణి, బి.మార్తమ్మ, అన్నపూర్ణ, ఎం.మార్తమ్మ, సిఐటియు జిల్లా అధ్యక్షుడు సుందరబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ పాల్గొన్నారు. గోపాలపురంలో జరిగిన సభకు ప్రాజెక్టు కార్యదర్శి ఎన్.రామలక్ష్మి అధ్యక్షత వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్.మాణిక్యంబ, జిల్లా కార్యదర్శి కె..బేబిరాణి బి.మార్తమ్మ అన్నపూర్ణ, ఎం.మార్తమ్మ నాయకత్వం వహించారు.










