ప్రజాశక్తి-రాజమహంద్రవరం సామాజిక, ఆర్థిక అసమానతలను దూరం చేస్తూ అందరికీ సమాన అవకాశాలు అందేలా చూడడం ప్రభుత్వ బాధ్యత అనిజిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ కె.ప్రత్యూష కుమారి పేర్కొన్నారు. సోమవారం 'ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం' సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. అర్హులైన వారు సంక్షేమ పథకాలను ఎలా వినియోగించుకోవాలనే విషయాలపై అందరిలో అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అర్హత కలిగి కూడా పథకాల లబ్ధి పొందలేని వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా వారి సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఆమె తెలిపారు. ఉన్నత విద్యలు, వసతి గృహాలు, ఆహారం, వైద్యం తదితర అవకాశాలను అర్హులైన వారు పొందడం వారి హక్కు అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పిఎస్.రమేశ్, కెఎన్.జ్యోతి, వై.సాంబమూర్తి, ఎ.విజయశాంతి, డి.సుభాష్ పాల్గొన్నారు.










