ప్రజాశక్తి - ఉండ్రాజవరం
కాల్దారి అండర్ పాస్ బ్రిడ్జి చిన్నపాటి వర్షానికే మోకాల్లోతు నీరు నిలువ ఉండిపోవడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే శాఖ లైన్ డబ్లింగ్, ఆధునికీకరణలో భాగంగా ప్రయాణికులకు రైలు గేటు అడ్డంకి లేకుండా కాల్దారిలో ఈ బ్రిడ్జిని ఏఆర్పటు చేసింది. వర్షం వస్తే బ్రిడ్జి కిందకు నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. అండర్ పాస్ బ్రిడ్జి పరిస్థితి ఇలా ఉండగా, కాల్దారి గ్రామం నుంచి బ్రిడ్జి వైపునకు చేరుకునే ప్రధాన రహదారి భారీ గుంతలు పడి ప్రమాదకరంగా మారింది. తరచు వాహనాలు గుంతల్లో పడిపోవటం, చిన్నపాటి ప్రమాదాలకు గురికావడం వంటివి ఇక్కడ నిత్యకృత్యంగా మారాయి. ఈ విషయమై పలుమార్లు సంబంధిత అధికారులకు విజ్ఞప్తులు చేసినప్పటికీ, పరిస్థితి మెరుగుపరచడం లేదని ఉండ్రాజవరం మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యులు షాజహాన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రైల్వే అధికారులు మానవ రహిత, ఆటోమేటిక్ మోటార్ పంపును ఏర్పాటు చేసినట్లు, ఇకపై బ్రిడ్జి అవస్థలు ఉండవని తెలిపినప్పటికీ సమస్యలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. సంబంధిత అధికారులు స్పందించి, ప్రయాణి కులకు, వాహనదారులకు ఇబ్బంది లేకుండా రోడ్డు, బ్రిడ్జిలను మెరుగుపరచాలని కాల్దారి వాసులు ఎం.స్వామి, జి.రాకేష్, కె.అప్పారావు, వేలివెన్ను వాసులు నటరాజ్ తదితరులు కోరుకుంటున్నారు.










