Apr 06,2023 13:58

ప్రజాశక్తి - ఉండ్రాజవరం : వైద్యం కోసం పేద‌, గ్రామీణ ప్రజలు ఇబ్బంది ప‌డ‌కుండా వారికి ఇంటి వ‌ద్దనే మెరుగైన వైద్యం అందించాల‌న్న‌దే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య లక్ష్యం అన్నారు. మండల పరిషత్ అధ్యక్షురాలు పాలాటి యల్లారీశ్వరి ఆ లక్ష్యాన్ని చేరుకునే కార్యక్రమంలో భాగంగా  ఫ్యామిలీ డాక్టర్ ప్రారంభించినట్లు ఆమె చెప్పారు. గురువారం మండలంలోని మోర్త గ్రామంలో ఆమె 104 వాహనాన్ని రిబ్బన్ కట్ చేసి,  ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మోర్త గ్రామ సర్పంచ్ చిటికిన సుజని, ఉప సర్పంచ్  దాపర్తి  రామ సందీప్, ఎంపీటీసీ వెలిగట్ల రాణి, జానీ,  నాగలక్ష్మి,  వైస్సార్సీపీ గ్రామ అధ్యక్షులు  సిహెచ్ సూర్యనారాయణ, గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.