Apr 14,2023 16:56

ప్రజాశక్తి - ఉండ్రాజవరం : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ వంటి మహానుభావుల విగ్రహాలను,  అంబేద్కర్ జయంతి రోజున తన చేతుల మీదుగా ఆవిష్కరించడం  తనకు అత్యంత గర్వకారణంగా ఉందన్నారు మండల పరిషత్ అధ్యక్షురాలు పాలాటి యల్లారీశ్వరి. శుక్రవారం మండలంలోని దమ్మెన్ను గ్రామంలో ఉండ్రాజవరం మండల సర్పంచ్ ల ఛాంబర్ అధ్యక్షులు, దమ్మెన్ను సర్పంచ్ గురజర్ల వీర వెంకట సత్యనారాయణ అధ్యక్షతన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ ల విగ్రహాల ఆవిష్కరణలో ఆమె పాల్గొని మాట్లాడారు.  ఈ సందర్భంగా విగ్రహాల దాత, ఎంపీటీసీ  గెడ్డం రామకృష్ణ మాట్లాడుతూ సుమారు లక్ష రూపాయలు పైగా సొంత నిధులు వెచ్చించి, తయారు చేయించిన విగ్రహాలను గమ్మును గ్రామంలో నిలిపేందుకు  స్థలం కేటాయించిన సర్పంచ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నందిగం భాస్కర రామయ్య, ఉండ్రాజవరం  మండల కో ఆప్షన్ సభ్యులు షాజహాన్, వైఎస్ఆర్సిపి నాయకులు పాలాటి శరత్ బాబు, గ్రామ ప్రజలు, అంబేద్కర్ అభిమానులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.