Mar 16,2023 23:38

ప్రజాశక్తి-యంత్రాంగం రాజమహేంద్రవరంలో ఆంధ్రరాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడని జిల్లా కలెక్టరు డాక్టర్‌ మాధవీలత పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో గురువారం పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధన కోసం అహర్నిషలు కషి చేసి ఆంధ్రరాష్ట్ర ఆవిర్భానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆరఒ జి.నరసింహులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రుడా కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిళ రెడ్డి పాల్గొన్నారు. దేవరపల్లి మండలం యర్నగూడెంలో గ్రంథాలయ అభివద్ధి కమిటీ చైర్మన్‌ ధూళిపూడి రవీంద్ర, మాజీ సైనికుడు బొంత చంద్రరావు, సత్తిపండు, అనిత, అచ్చమ్మ నివాళి అర్పించారు. తాళ్లపూడిలో సింహాద్రి జనార్ధనరావు బస్టాండ్‌ సెంటర్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గోకవరంలో బత్తుల నానాజీ ఆధ్వర్యాన నివాళులు అర్పించారు. కడియం ఎంపిడిఒ కార్యాలయంలో ఎంఇఒ వి.లజపతిరారు, ఇఒపిఆర్‌డి వైవివి.సుబ్బలక్ష్మి, ఎఇ త్రిమూర్తులు, చిలుకూరి శ్రీనివాసరావు, గుమ్మడి రత్నం రాజు, విజరు, జయపతి, శ్రావ్య పాల్గొన్నారు. వైసిపి రాష్ట్ర కార్యదర్శి బాధ్యతా సేవా సంస్థ అధ్యక్షులు గిరజాల వీర్రాజు (బాబు) శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్‌.ఎస్‌.ఎన్‌.మూర్తి, చెక్క కాశీ, గ్రంధి నాగేశ్వరరావు, దొడ్డా బుజ్జి, గుత్తుల వాసు, కందా రాజు, కడియం గణేష్‌, మంగు వరప్రసాద్‌, బొమ్మిరెడ్డి సత్తిబాబు, కడియం గంగారావు, మైపాల వాసు, గుత్తుల రమేష్‌ పాల్గొన్నారు. రాజానగరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్‌ ఆచార్య టి.అశోక్‌ శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రిన్సిపాల్స్‌ ఎస్‌.టేకి, డాక్టర్‌.పి.విజయనిర్మల, డాక్టర్‌ పి.వెంకటేశ్వరరావు, డీన్స్‌ ఆచార్య పి.సురేష్‌ వర్మ, డాక్టర్‌ ఎన్‌.ఉదరు భాస్కర్‌, డాక్టర్‌ ఎం.గోపాలకృష్ణ, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ జి.చంద్రకళ, ఫైనాన్స్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు. చాగల్లులో గ్రామ సర్పంచ్‌ ఉన్న మట్ల మనశ్శాంతి పంచాయతీ, కార్యదర్శి ఎల్‌.రవికుమార్‌, సీనియర్‌ నాయకులు గంట్రోతు సూర్యనారాయణ, శ్రీకాకుళం ఆంజనేయులు పాల్గొన్నారు. ఉండ్రాజవరంలో కొర్లేపర సుబ్బారావు, సింహాద్రి గుప్తా, కొల్లూరి సోమేశ్వరరావు, పథ్వీ, కోట్ల విజరు, పచ్చిపులుసు పుల్లేశ్వరరావు, ఆత్యం మూర్తి, కోట్ల సత్తిరాజు, నూలు వెంకట సుబ్బారావు, తుమ్మలపల్లి శ్రీనివాసు, నాగావరపు సత్యనారాయణ పాల్గొన్నారు.