Jun 22,2023 21:31

వినతిపత్రం అందిస్తున్న నాయకులు

ప్రజాశక్తి -గోకవరం
గోకవరంలో కాలువ గట్లు, ప్రభుత్వ భూముల్లో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను ఆపాలని గురువారం బహుజన పరిరక్షణ సమితి సభ్యులు పంచాయతీ కార్యదర్శి టి.శ్రీనివాస్‌కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడారు. సంజీవయ్య నగర్‌ వెళ్లే దారిలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద ఉన్న ఊరకాలువ గట్టును ఆనుకొని అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. గతంలో ఆర్‌టిఐ ద్వారా కోరిన సమాచారం మేరకు పంచాయతీ రెవెన్యూ ఇరిగేషన్‌ అధికారులు ఈ భూమికి ఎటువంటి పట్టాలు మంజూరు చేయలేదని, కట్టడాలకు అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. వెంటనే వీటిని ఆపాలన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి సభ్యులు ఈది అశోక్‌, జి.శివప్రసాద్‌, పి.ప్రభ, ఐ.ప్రసాద్‌కుమార్‌ పాల్గొన్నారు.