ప్రజాశక్తి-గోకవరం : మండలంలోని తంటికొండ గ్రామంలో తంటికొండ గ్రామానికి చెంది ఆకుమూరి వెంకటేశులు ఆకుమూరి పండులకు చెందిన తాటాకు ఇల్లు ఇటీవల ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతి అయ్యింది. ఇల్లు పూర్తిగా దగ్ధం అయిన కారణంగా రెండు కుటుంబాలు కట్టుబాటులతో మిగిలారు. విషయం తెలుసుకున్న గోకవరం ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు దంపతులు సోమవారం ఉదయం బాధితులు ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి మూడు బస్తాలు బియ్యం నిత్యవసర సరుకులు 3వేలు రూపాయలు నగదు ఆ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా సుంకర వీరబాబు మాట్లాడుతూ ప్రభుత్వం నుండి రావాల్సిన రాయితీలను రావడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బదిరెడ్డి సత్యనారాయణమ్మ అప్పన్న దొర వైస్ ఎంపీపీ మడికి మైనర్ బాబు తంటికొండ దేవస్థానం చైర్మన్ బదిరెడ్డి రాంబాబు గోకవరం తహశీల్దార్ ఏ శ్రీనివాస్ ఆర్ ఐ శ్రీరాములు పంచాయతి సెక్రటరీ గానిరాజు తదితర వైసిపి నాయకులు పాల్గొన్నారు.










