Feb 27,2023 18:44
  • ఆశాలపై రాజకీయ, అధికారుల వేదింపులు అపాలి.
  • అశాలకు పని బారాన్ని తగ్గించాలి.
  • వేతన బకాయిలు ఇవ్వాలి.
  • సమస్యలపై సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్... 

ప్రజాశక్తి - ధవళేశ్వరం: ఆశాల సమస్యలపై కలెక్టరేట్ వద్ద మండుటెండలో మహా ధర్నా చేపట్టారు.ఆశాలపై రాజకీయ నాయకులు , అధికారుల వేదింపులు అపాలని,అశాలకు పని బారాన్ని తగ్గించాలని,వేతన బకాయిలు ఇవ్వాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా కమిటీ పిలుపు మేరకు బొమ్మూరులోని స్థానిక హార్లిక్స్ ఫ్యాక్టరి ఎదురుగా వున్నా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం మహాధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రం జిల్లా కలెక్టర్ మాధవీలత కి అందజేశారు. కలెక్టర్ సమస్యలపై సానుకూలంగా స్పందించారు. అంతకముందు ధర్నానుద్దేశించి సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం. సుందరబాబు, బి. రాజులోవ, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అన్నామని, కె. పోశమ్మ, జిల్లా ట్రజరర్ ఎం. వెంకటలక్ష్మి, నిడదఓలు పట్టణ గౌరవ అధ్యక్షులు జె. రాంబాబు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా లకు వేతనాలు ఇచ్చి విశయం లో తీవ్ర జాప్యం చేస్తున్నాయని అన్నారు. వేతనాలు తక్కువ గా వున్నప్పుడు ఎవరూ ముందుకు రాకపోయినా పట్టించుకోని అధికారపార్టీ నాయకులు  వేతనాలు పెరిగాక వున్నవారిని ఎలాగైనా తొలగించి తమ అనుకునేవారికి పోస్టులు అమ్ముకుని అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. జిల్లా లో కోవిడ్ లో మరనించిన వారి స్థానం లో కారుణ్య నియామకాల ద్వారా చనిపోయిన ఆశా కుటుంబం లో వారికీ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశాలకు సంభందం లేని వ్యాక్షిన్ క్యేన్లు తీసుకురమ్మి ని చెప్పడం, యూనిఫామ్ తెమ్మనడం వంటి పనులు  అధికారులు చేస్తున్నారని, వాటిని మానుకోవాలని అన్నారు. జిల్లా లో  స్థానికం గా పీహెచ్ సి లలో సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయని వాటిని పరిష్కరానికి అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమం లో సీఐటీయూ జిల్లా కోశాధికారి కె. ఎస్. వి. రామచంద్ర రావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్. ఎస్. మూర్తి, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు బి.ధనలక్ష్మి, నాగమణి, లక్ష్మి,మేరీ,కె. వెంకట లక్ష్మి, హవేళ, సత్యవతి, లీల,కుమారి, తదితరులు పాల్గొన్నారు.