ప్రజాశక్తి - కడియం
కడియం మండలం మురమండలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబానికి బాధ్యత సేవా సంస్థ చేయూత నందించింది. వ్యవస్థాపక అధ్యక్షులు గిరజాల బాబు ఆధ్వర్యంలో మురమండ పంచాయతీ పరిధిలో ఉన్న చింతాలమ్మ పుంత రోడ్డులో అగ్ని ప్రమాద బాధిత కుటుంబం పండూరి అప్పారావు, దేవుడమ్మ వద్ధ దంపతులకు వంట పాత్రలు, బియ్యం, నిత్యావసర వస్తువులు, దుస్తులు, నగదు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత సంఘాల అధ్యక్షుడు యర్రా సూర్యనారాయణ మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా బాధ్యత సేవా సంస్థ ఆధ్వర్యంలో గిరజాల బాబు చేస్తున్న సేవలు అభినందనీ యమన్నారు. గిరజాల బాబు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకునే తత్వం ప్రతీ ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. బాధిత కుటుంబానికి వార్డు మెంబర్ యర్రంశెట్టి వీరబాబు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో మెల్లిమి గంగరాజు, గన్ని పెదబాబి, కొఫ్పాక రమణ, అయినవిల్లి ప్రసాద్, కోటిపల్లి లక్ష్మణరావు, భోగాల మాధవరెడ్డి, మజ్జి కన్నమనాయుడు, యేలేటి శ్రీనివాస్ పాల్గొన్నారు.










