May 15,2023 23:56

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్‌ మండల అధికారులందరూ మండల కేంద్రంలో స్పందన కార్యక్రమంలో విధిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత స్పష్టం చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో స్పందన అర్జీలను స్వీకరించే క్రమంలో డివిజన్‌, మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారుల హాజరును జెసి, కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీల స్వీకరించి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆ దిశలో జిల్లాలో ప్రతి డివిజన్‌, మండల పరిధిలోని అధికారులు, ఆయా మండలాల ప్రత్యేకాధికారుల ద్వారా నేరుగా ప్రజల నుంచి ఒకే చోట ఉండి అర్జీలను స్వీకరించాల్సి ఉంటుందన్నారు. ఆ మేరకు ప్రత్యేకాధికారులు ముందస్తుగా మండల అధికారులకి సూచనలు జారీ చేసి, ప్రజలకు తగిన సమాచారం ముం దస్తుగా చేరవేసి, అధికారులు ప్రజా సమస్యల పరిష్కారం చేయ నున్నట్లు తెలియ పరచడం ముఖ్యం అన్నారు. మండల ప్రత్యేక అది óకారులు మండలాల్లో హాజరై, తదుపరి జిల్లా స్థాయి అధికారి కలెక్టరేట్‌కు హాజరు కావాలని మాధ వీలత తెలిపారు. తహశీల్దార్‌, మండల అభివద్ధి అధికారి సమన్వయంతో పనిచేయాలని, స్పందనకు హాజరు కానీ అధికారుల ద్వారా వివరణ తీసుకోవాలని ముందస్తుగా పత్రికల ద్వారా ప్రజలకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సోమవారం స్పందనలో రెవెన్యూ, భూ అక్రమణ సమస్య, వికలాంగుల ధ్రువపత్రం, పెన్షన్‌, సివిల్‌ తగాదాలు, కొంతమూరులో చెరువు త్రవ్వకం, తదితర మొత్తం 109 అర్జీలు వచ్చాయి.