ప్రజాశక్తి - యంత్రాంగం ఆడ పిల్లలను పురిటిలోనే హత్య చేయకుండా రక్షించుకోవాలని పలువురు అన్నారు. పలుచోట్ల గురువారం బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించారు. ఉండ్రాజవరం పిహెచ్‌సిలో వైద్యాధికారి డాక్టర్ ప్రసాద్ మాట్లాడారు. ఆడపిల్లలను గౌరవించి, చదివించి ఉన్నత విద్యావంతులుగా చేయడం వల్ల ఆ కుటుంబం అంతా అభివృద్ధి చెందుతుందని, తద్వారా దేశం ఆరోగ్యవంతమైనదిగా మార్పు చెందుతుందన్నారు. ప్రతి ఆడపిల్లను గౌరవిస్తూ రక్షించుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఒ సుబ్రహ్మణ్యం, పిహెచ్‌ఎన్, కెడివిఎల్. కుమారి, ఎంఎల్‌హెచ్‌పి పూజశ్రీ దుర్గ, హెల్త్ అసిస్టెంట్ రామకష్ణ పాల్గొన్నారు. చాగల్లు బ్రాహ్మణగూడెం పిహెచ్‌సి, జెడ్‌పి హైస్కూల్లో 'ఆడపిల్లను రక్షించు ఆడపిల్లను చదివించు కార్యక్రమం నిర్వహించారు. పిసిపిఎన్‌డిటి చట్టం గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్.శ్రీనివాస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజరు కుమార్, పిహెచ్‌ఎన్‌వి.పద్మ, ఎస్.సారమ్మ, ఎం.రాజశేఖర్, డి.వెంకట రామకృష్ణ, పి.రేవతి, డి.నరసమ్మ పాల్గొన్నారు. నల్లజర్లలో లింగ వివక్షత నిర్మూలనపై అవగాహన కల్పించారు. ప్రభుత్వాసుపత్రి వైద్య ఉద్యోగుల ఆధ్వర్యంలో స్థానిక ఎకెఆర్‌జి విద్యాసంస్థల ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్ మహ్మద్ సిరాజుద్దీన్ మాట్లాడుతూ, ఆడపిల్ల అంటే మరో అమ్మ అని.. ఈరోజు ఆడపిల్ల వద్దనుకుంటే రేపు మన సమాజం అమ్మలేని అనాథగా మారిపోతుందని చెప్పారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కలిదిండి వెంకట చంద్రశేఖరరాజు మాట్లాడుతూ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం గురించి అవగాహన కల్పించారు. కళాశాల డైరక్టర్ వడ్లమూడి రామారావు, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ నంద్యాల శ్రీనివాస్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.వరలక్ష్మి, ప్రభుత్వాసుపత్రి సీనియర్ అసిస్టెంట్ యోహన్, ఆరోగ్య కార్యదర్శి చింతలపూడి జ్యోతి, ఎంఎల్‌హెచ్‌పి పల్లి మణి, ఆరోగ్య సహాయకులు జివివి.ప్రసాద్, డివి.రామారావు, తుంపూడి రాఘవేంద్రరావు పాల్గొన్నారు. సీతానగరం కస్తూర్బా గాంధీ ఆశ్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పిహెచ్‌ఒ రాధాకృష్ణ, జెడ్‌పిహెచ్ పాఠశాల పీడీ తమ్మయ్య, హెల్త్ క్లినిక్ సిహెచ్‌ఒ స్వరూప, సూపర్వైజర్ దైవ కప, ఆరోగ్య కార్యకర్త, నందీశ్వరరావు, ఎఎన్‌ఎం మున్నీసా, సలేమబీ, సంధ్య, ఆశా కార్యకర్తలు, దేవి, జ్యోతి పాల్గొన్నారు.










