Oct 14,2023 15:36

ప్రజాశక్తి - ఉండ్రాజవరం : మండలంలోని కాల్దరి గ్రామ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు, సొసైటీ అధ్యక్షులు అబ్బిన రాంబాబు మాతృమూర్తి అబ్బిన పార్వతి (74) శనివారం ఉదయం హఠాన్మరణం చెందారు. విషయం తెలుసుకున్న నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు, కాల్దారి రాంబాబు ఇంటి వద్ద ఆమె భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాలవేసి, నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి నందిగం భాస్కర రామయ్య,  కుటుంబ సభ్యులు అబ్బిన సత్యనారాయణ, వీరవల్లి పార్వతి, గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.