ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : గంగాధర నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండలం, మాంబేడు గ్రామంలో రైతు కె.కనుగోండారెడ్డి కి చెందిన పాడి ఆవు అనారోగ్యంతో నాలుగు రోజులుగా బాధపడుతూ ఉంది. బుధవారం ఆ రైతు టోల్ ఫ్రీ నెంబర్ 1962 కి ఫోన్ చేయడంతో వైఎస్సార్ పశువు సంచార వైద్య వాహనం వచ్చింది. అందులో ప్యారా విట్ అశ్విని వచ్చి పర్యావరణంను పరిశీలించి రైతుకు ధైర్యం చెప్పింది. ఆవుకి ఏమి కాదు .. ధైర్యంగా ఉండండి అని వైద్యం అందించింది. ప్రస్తుతం ఆవు ఆరోగ్యం గతం కంటే కొంత మెరుగుపడిందని రైతు చెబుతున్నారు. ఆమెతోపాటు పైలెట్ యశ్వంత్ ఉన్నారు.










