ప్రతి ఇంట మా నమ్మకం నువ్వే జగన్ : వైసిపి మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్
ప్రజాశక్తి - ఆలమూరు (తూర్పు గోదావరి) : సిఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మండలంలోని చెముడులంకలో వైఎస్‌ఆర్సిపి మండల కన్వీనర్, గ్రామ సర్పంచ్ తమ్మన శ్రీనివాస్ ఆధ్వర్యంలో మూడవ రోజు పార్టీ గఅహసారథులు, కన్వీనర్లు, వాలంటరీలు సహకారంతో ఆదివారం నిర్వహించారు. ఇందులో భాగంగా గడపగడపకు తిరుగుతూ గత ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వ పాలన గురించి, జగనన్న ప్రభుత్వంలో నవరత్నాలలో భాగంగా సంక్షేమ పథకాల గురించి వివరించారు. గ్రామంలోని అభివఅద్ధి కార్యక్రమాల గురించి తెలియజేసి మరొకసారి జగన్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని గ్రామ ప్రజలను కోరారు. అనంతరం లబ్ధిదారుల అనుమతితో తలుపులకు మా నమ్మకం నువ్వే జగన్ అనే గోడ పత్రికలను అతికించి, ప్రజాభిప్రాయాన్ని సేకరించి 8296082960 నెంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దొండపాటి చంటి, వైసిపి గ్రామ కమిటీ ప్రెసిడెంట్ దొండపాటి వెంకటేశ్వరరావు, సచివాలయం కన్వీనర్లు బోనం కిట్టయ్య, బుడ్డిగ వీర వెంకట్రావు, మోటూరి సురేష్, తమ్మన హరి, నేతలు అడబాల వీర్రాజు, నాగిరెడ్డి సత్యనారాయణ, రాయుడు వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.










