Mar 12,2023 12:44

ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్‌ కోనసీమ) : మండలంలోని ఏడిద గ్రామంలో వైసిపి 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గ్రామ పార్టీ అధ్యక్షులు పలివెల సుధాకర్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగాలుగా జడ్పిటిసి కుడిపూడి భవాని రాంబాబు, వైస్‌ ఎంపీపీ పసుమర్తి నాగేశ్వరరావు, గ్రామ ఉప సర్పంచ్‌ సండ్ర శ్రీనివాస్‌ సొసైటీ అధ్యక్షులు రామిశెట్టి శ్రీహరిబాబు హాజరయ్యారు. నేత రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి పూలమాలు వేసి పార్టీ జెండాను ఎగరవేసి వేశారు. వారు మాట్లాడుతూ ... 3648 కిలోమీటర్ల నడిచి ప్రజల కష్టాలు తెసుకున్న గొప్ప మహౌన్నతమైన నాయకుడు జగన్మోహన్‌ రెడ్డి అని వారు కొనియాడారు. రాబోయే రోజుల్లో 2024 లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మరల అధికారులు రావడం ఖాయమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు పట్నాల నాగబాబు, చొల్లంగి రామారావు, తాతపూడి ఉషా రాజేష్‌, పార్టీ నాయకులు బురిగజాని, పలివెల పద్దయ్య,రామిశెట్టి వీర్రాజు, వాసంశెట్టి వెంకటరమణ, తాతపూడి రాజు. మల్లిపూడి గోవిందు, చిట్టూరి శ్రీనివాస్‌, తేలు శ్రీనివాస్‌, కుడిపూడి వెంకటేశ్వరావు, ఎడ్ల వీర్రాజు, ఆటో యూనియన్‌ సభ్యులు, గ్రామ సచివాలయం కన్వీనర్‌ పాల్గొన్నారు.