ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : రైతు సమస్యలు తెలుసుకునేందుకు సర్ ఆర్ధర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ పాలకవర్గ సభ్యులు దామిరెడ్డి పల్లి, మాధవరాయుడు పాలెం, మురముండ, దుళ్ళ రైతులతో సమావేశం నిర్వహించారు. కడియం మండలం, దామిరెడ్డి పల్లి పంచాయతీ పరిధిలోని దేవి గుడి వద్ద ఈ సమావేశం జరిగింది. అసోసియేషన్ పాలకవర్గ అధ్యక్షులు మల్లు పోలరాజు, దామిరెడ్డి పల్లి డైరెక్టర్ గాజుల రత్తయ్య నర్సరీ రైతుల సమస్యల గురించి చర్చించారు. అనంతరం మల్లు పోలరాజు మాట్లాడుతూ నర్సరీరంగ అభివద్ధి కోసం తామంతా కషి చేస్తామన్నారు. నూతన పాలక వర్గ సభ్యులను రైతులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో దామిరెడ్డి పల్లి పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ ముద్రగడ జెమీ, అసోసియేషన్ సెక్రెటరీ గాధ నాగేశ్వరరావు (శ్రీ నాగ్), ట్రెజరర్ తాడాల బాల మురళీకృష్ణ, జాయింట్ ట్రెజరర్ జంగా సుబ్బారావు, పీఆర్‌ఓ గరగ నాగేశ్వరరావు, కన్వీనర్ అడ్డగర్ల రమేష్, పిల్లా శ్రీనివాస్, కొండేపూడి నాగు, నర్సరీ రైతులు పాల్గొన్నారు.










