Mar 01,2023 12:52

ప్రజాశక్తి - ఉండ్రాజవరం (తూర్పు గోదావరి) : మండల కేంద్రం ఉండ్రాజవరం గ్రామ విఆర్వో తల్లి వెలిచేటి శేషారత్నం (85) మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు పాపారావు ఉండ్రాజవరం విఆర్వోగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉండ్రాజవరం మండలం టిడిపి అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ, నిడదవోలు ఏఎంసి వైస్‌ చైర్మన్‌ వెలిచేటి జానకిరామయ్య, ఉండ్రాజవరం మానవత శాఖ సభ్యులు వెలిచేటి బోసు, పలువురు గ్రామస్తులు బుధవారం పాపారావు ఇంటికి చేరుకుని, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.