Jul 25,2023 14:38

ప్రజాశక్తి-గోకవరం(తూర్పుగోదావరి) : కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని14 గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాల్లో ముమ్మరంగా వరి నాట్లు ప్రారంభమయ్యాయి. కురిసిన వర్షాలు కారణంగా చేరువులు పొంగి పారుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలలో కురిసిన వర్షాలకు దిగుప్రాంతమైన గోకవరం మండలంలోని చెరువులన్నీ కాలువలు పొంగి పోర్లడంతో రైతులు కళ్ళల్లో ఆనందాలు వెలుగు చూశాయి. మండలంలోని సుమారు 12వేల ఎకరాలలో వరి సాగు చేస్తున్న రైతులకు వరినాట్లు పనిలో బిజీ బిజీగా ఉన్నారు వ్యవసాయ కూలీలు కూడా సమృద్ధిగా పనులు కొనసాగుతున్నాయి. గత సంవత్సరం కన్నా ఈ ఏడాది వర్షాలు కురవడంతో వరినాట్లు కూడా ముందుగానే వేయడం జరుగుతుందని పలువురు రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.