Sep 28,2023 14:56

ప్రజాశక్తి-కొవ్వూరురూరల్‌(తూర్పుగోదావరి) : కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత గుఱ్ఱం జాషువా రచనలను ప్రభుత్వం పాఠ్యంశములుగా చేర్చాలని దళిత నాయకులు పెనుమాక జయరాజు పేర్కొన్నారు. స్థానిక ఎల్‌ఐసి సెంటర్లో పెనుమాక జయరాజు ఆధ్వర్యంలో గుఱ్ఱం జాషువా విగ్రహనికి. పూలమాలలు వేసి 129వ జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం జయరాజు మాట్లాడుతూ.. ఆధునిక కవులలో జాషువా గొప్ప కవి అని, సమాజంలో ఉన్న సామజిక రుగ్మాతలను తన కలం ద్వారా రూపు మాపడానికి కృషి చేశారని, తక్కువ కులంలో జన్మించి అనేక అవమానలను ఎదుర్కొని గొప్ప కవిగా కీర్తి గడించారాన్నారు. గబ్బిలం, ఫిరాదౌసి వంటి రచనలు చెసి పద్మ భూషస్‌ పొందరాని జయరాజు అన్నారు. విశ్వమానవ సమానత్వం గురించి గర్జించిన కవి జాషువా అని అన్నారు. ఈ కార్యక్రమంలో కవులూరి సూర్యచంద్రం, బోలిపో మధు, కొడమంచిలి సత్యనారాయణ, డి. రాధాకృష్ణ, దున్నా ప్రకాష్‌, దళిత నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.