ప్రజాశక్తి-బిక్కవోలు (తూర్పు గోదావరి) : బిక్కవోలు వ్యవసాయ సలహామండలి ఛైర్మన్ నల్లమిల్లి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఝూడా ఛైర్మన్ మేడపాటి షర్మిలా రెడ్డికి వైసిపి నాయకులు బుధవారం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వెంకట రెడ్డి మాట్లాడుతూ ... బలభద్రపురంలో ఊర చెరువు గట్టు చూట్టూ గ్రామంలోని ప్రజలందరికి ఉపయోగపడే విధంగా వాకింగ్ ట్రాక్ నిర్మించాలని, అందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని ఝూడా ఛైర్మన్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేసి గ్రామాభివృద్దికి సహాకరించాలని కోరామని, ఈ అంశం పై ఆమె సానుకూలంగా స్పందించనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ మల్లెశ్వరావు, ఎంపిటిసి సబ్బేళ్ళ సూజాత వీర్రాఘవరెడ్డి, వైసిపి నాయకులు సత్తి శ్రీనివాస్ రెడ్డి, పడాల వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.










