అంగన్వాడీల సమస్యల్ని పరిష్కరించాలి : సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం.సుందరబాబు
ప్రజాశక్తి-గోపాలపురం (తూర్పు గోదావరి) : అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, ఐసిడిఎస్ బలోపేతానికి బడ్జెట్లో నిధులు పెంపుదల చేయాలని, అంగన్వాడీలకు జగన్ ఇచ్చిన హామీలు అమలుచేయాలని, అంగన్వాడీల పోరు యాత్రలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం.సుందరబాబు డిమాండ్ చేశారు. బుధవారం గోపాలపురంలో జరిగిన సభకు ప్రాజెక్టు కార్యదర్శి ఎన్.రామలక్ష్మి అధ్యక్షత వహించారు. సుందరబాబు మాట్లాడుతూ ... కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడి వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి కుట్ర పన్నుతున్నాయని, అందులో భాగంగానే నూతన విద్యా విధానం పేరుతో, అంగన్వాడీ కేంద్రాల్లో పాఠశాలలను విలీనం చేస్తున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్ కి బడ్జెట్లో నిధులు కేటాయింపు తగ్గించి వర్కర్లకు ఆయాలకు ఇవ్వాల్సిన ప్రయోజనాలను తగ్గిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. చిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్ వారి సమస్యల పరిష్కారం చేయలేదని చెప్పారు. సమస్యలుహొ పరిష్కరించాలని కోరితే నిర్భందాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. మాట తప్పను మడమ తిప్పను అన్న ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. వేతనాలు తక్కువైనా పని ఒత్తిడి మాత్రం తీవ్రంగా ఉందని అన్నారు.హొఈ పోరు యాత్ర జాతాకు అంగన్వాడి వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్.మాణిక్యం, జిల్లా కార్యదర్శి కే.బేబీ రాణి, బి.మార్తమ్మ, అన్నపూర్ణ, ఎం.మార్తమ్మ నాయకత్వం వహించారు. ప్రాజెక్ట్ సభ్యులందరూ పాల్గొన్నారు.










