ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి (చిత్తూరు) : మండలంలోని ధర్మపురి పంచాయతీ పరిధిలో ఉన్న తూర్పుగడ్డ గ్రామంలో గుర్తు తెలియని దుండగులు సోమవారం రాత్రి ముగ్గురు రైతుల గడ్డివాములను తగలబెట్టారు. దీని కారణంగా రైతులు వేమన్న తండ్రి ముత్యాలప్ప, విశ్వనాధ్ తండ్రి సుబ్బయ్య, నాగభూషణం తండ్రి అంజప్ప ముగ్గురు రైతుల గడ్డివాములు రాత్రికి రాత్రే బూడిదపాలయ్యాయి. వీటి కారణంగా రైతులకు సుమారు 90 వేల రూపాయలు నష్టం కలిగినట్లు స్థానిక వాలంటరీ మురళి ఒక ప్రకటనలో తెలిపారు.










