Aug 09,2023 13:18

న్యూఢిల్లీ : ఢిల్లీలో మాయాపురిలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులకు గాయలయ్యాయని అధికారులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోఫా స్ప్రింగ్స్‌ ప్యాకింగ్ ఫ్యాక్టరీలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో బుధవారం తెల్లవారుజామున 2.05 గంటల సమయంలో మంటలు చెలరేగినట్లు సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు సంఘటనా స్థలానికి ఐదు అగ్నిమాపక యంత్రాలు చేరుకుని.. మంటల్ని అదుపులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక ఈ అగ్నిప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వారిని సమీపంలోని దీన్‌ దయాళ్‌ ఉపాధ్యారు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.